భారత్ న్యూస్ రాజమండ్రి…సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‍ఐపీబీ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం

Ammiraju Udaya Shankar.sharma News Editor…•11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
•ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఆమోదం.
•వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా.
•దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలిపిన 11వ SIPB.
•రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న RAIDEN INFO TECH DATA CENTERకు ఆమోదం
•గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో FDI రాలేదంటున్న ప్రభుత్వ వర్గాలు.
•RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందన్న SIPB సమావేశం.
•అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి, మంత్రుల అభినందనలు.
•15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న ముఖ్యమంత్రి.
•3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన SIPB సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ.
•భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం.
•కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా బాధ్యత తీసుకోనున్న ప్రత్యేక అధికారులు.
•ఇప్పటి వరకు జరిగిన 11 SIPBల ద్వారా రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
•6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం.
