భారత్ న్యూస్ శ్రీకాకుళం….అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ – ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు.
అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజల నుంచి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు స్వయంగా అర్జీలను స్వీకరించారు.ఉదయం నుంచి కార్యాలయానికి వచ్చిన వృద్ధులు, మహిళలు, రైతులు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి రామమోహనరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,అశ్వరావుపాలెం నీటి సంఘాల అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు పార్టీ నాయకులు నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
