మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం: మంత్రి లోకేశ్.

భారత్ న్యూస్ నెల్లూరు..మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం: మంత్రి లోకేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…డాలస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ – స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని వెల్లడి

అమెరికాలోని డాలస్‌​లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. లోకేశ్​కు అక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున్న పాల్గొని ఘనస్వాగతం పలికారు. అభిమానులు కేరింతలు, ప్రవాసాంధ్రుల జోష్ మధ్య లోకేశ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. స్పీడ్​కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్​గా మారిందని అభివర్ణించారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్, ఎంబీయే చదవటంతో పాటు వరల్డ్ బ్యాంక్​లో పనిచేసిన తనకు అమెరికాతో దాదాపు 9 ఏళ్లు అనుంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుని 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి తమకు అండగా నిలిచారని లోకేశ్ ప్రశంసించారు.

రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమని చెప్పారు. కలిసికట్టుగా పని చేస్తామని పవన్ కల్యాణ్ కూడా అంటున్న వ్యాఖ్యలను లోకేశ్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్ల