భారత్ న్యూస్ గుంటూరు…అందరూ ఆహ్వానితులే*
“మహాపురుషుడు మండలి” నాటక ప్రదర్శన*
అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఈ నెల 19వ తేదీ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు, తెలుగు జాతి రత్నం, దివిసీమ పునర్నిర్మాత, ఆర్త జన బంధువు, తెలుగు భాష అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారిచే గంగోత్రి సాయి దర్శకత్వంలో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన “మహాపురుషుడు మండలి” నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నవంబర్ 19వ తేదీ జరిగే “1977 దివిసీమ ఉప్పెన మృతుల 48వ సంస్మరణ సభ – మానవతా మూర్తులకు దివ్య వందనం ” కార్యక్రమం సందర్భంగా ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
19వ తేదీ సాయంత్రం జరిగే నాటక ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులే…
