చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాల) పై అవగాహన కార్యక్రమాలు – ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు

భారత్ న్యూస్ విజయవాడ…చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాల) పై అవగాహన కార్యక్రమాలు – ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు

పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి మేరకు, ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివాహ పాఠశాలలు మరియు కళాశాలల్లోని విద్యార్దులకు బాల్య నిరోధంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు జరిగాయి.

పోలీసు అధికారులు విద్యార్థులకు మ్యా బాల్య వివాహం వల్ల కలిగే నష్టాలు, అలాగే చైల్డ్ రేజ్ ప్రోహిబిషన్ యాక్ట్‌ కింద ఉండే న్యాయపరమైన శిక్షలు గురించి అవగాహన కల్పించారు.

బాల్య వివాహం వల్ల వచ్చే ప్రమాదాలు:
చదువు మధ్యలోనే ఆగిపోవడం
చిన్న వయస్సులో గర్భధారణ వల్ల ఆరోగ్య సమస్యలు
మానసిక ఒత్తిడి, డిప్రెషన్
కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం
భవిష్యత్తు అవకాశాలు కోల్పోవడం

చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ యాక్ట్ కింద శిక్షలు :
18 సంవత్సరాల లోపు అమ్మాయి / 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం చేయడం చట్ట విరుద్ధం

బాల్య వివాహం నిర్వహించిన వారికి:
2 సంవత్సరాల వరకు జైలుశిక్ష
₹1 లక్ష వరకు జరిమానా

బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు / బంధువులు:
2 సంవత్సరాల జైలుశిక్ష
₹1 లక్ష వరకు జరిమానా

మధ్యవర్తులు / పూజారి / ఆర్గనైజర్లు:
జైలుశిక్ష భారీ జరిమానా

బాలిక లేదా ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటారు:
బాల్య వివాహం జరిగిన తర్వాత కూడా, అది చట్టపరంగా రద్దు (రద్దు) చేయించుకునే అవకాశం ఉంది.

ఫిర్యాదు కోసం:
1098 (చైల్డ్‌లైన్)
112 (ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్)

సమాజం, కుటుంబం, పాఠశాలలు — అందరూ కలిసి బాల్య వివాహాలను నిరోధించాలి.

పోలీస్ అధికారులు అవగాహన కల్పిస్తూ, సామాజిక బాధ్యతగా అందరూ ముందుకు రావాలని తెలియజేసారు .