గిద్దలూరులో అత్యంత దారుణానికి ఒడిగట్టిన సంఘటన

భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకాశం జిల్లా…

గిద్దలూరులో అత్యంత దారుణానికి ఒడిగట్టిన సంఘటన…..

అప్పుడే పుట్టిన శిశువును బకెట్ లో పడవేసి పత్తాలేకుండా ఎటో వెళ్లిపోయిన బాలింత…

సోమవారం అర్ధరాత్రి సమయంలో గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీ..

వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోని వాష్ రూమ్ వద్ద డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ..‌‌…

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఓ బకెట్ లో మగ శిశువును వదిలి వెళ్లిపోయిన బాలింతరాలు…

శిశువు ఏడుస్తున్న శబ్దాలు విని ఉలిక్కిపడి ఆఘమేఘాలపై వెళ్ళి బకెట్ ను పరిశీలించిన ఆసుపత్రి సిబ్బంది..

శిశువు ప్రాణాలతో ఉండడంతో వెంటనే వేరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారాన్ని అందించిన ఆసుపత్రి సిబ్బంది…