భారత్ న్యూస్ గుంటూరు….రేపు అవనిగడ్డ లో మెగా జాబ్ మేళా
అవనిగడ్డ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 20 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు క్లిన్ కారా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గుడివాక లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని, ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల్లో మేనేజర్, రిటైల్ సేల్స్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, కెమిస్ట్, తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. శుక్రవారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ జాబ్ మేళా ను ప్రారంభిస్తారని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని గుడివాక లక్ష్మీ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 9014333335 నంబర్ ని సంప్రదించాల్సిందిగా కోరారు
