మన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు,శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్

భారత్ న్యూస్ గుంటూరుAmmiraju Udaya Shankar.sharma News Editor……..మన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు,శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ గారు కోడూరు మండలం, నాగాయలంక మండలం లో 100 రోజుల నుండి తీర ప్రాంత గ్రామాలకు రెండు పూటలా పూటకి 20 వేల లీటర్ల చొప్పున రోజుకి 40 వేల లీటర్ల ఉచిత తాగునీరు సరఫరా చేసి దాహార్తి తీరుస్తున్న సందర్భంగా కోడూరు మండల ప్రజల తరఫున మా కృతజ్ఞతలు.

కోడూరు మండలం చింత కోళ్ల, బసవనిపాలెం,రామకృష్ణాపురం, ఇరాలి,పాదాలవారిపాలెం, హంసలదీవి,పాలకాయతిప్ప గ్రామం లో నాగాయలంక మండలం సంగమేశ్వరం,పాత ఉపకాలి గ్రామాలలో ఉచిత మంచినీటిని సరఫరా చేస్తున్న మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తన తండ్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి మండలి ఫౌండేషన్ జ్ఞాపకార్ధం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గారు పర్యవేక్షిస్తున్నారు