ఆదాయపు పన్ను చట్టం 2025.. ‘ప్రారంభ్’ పేరుతో కార్యక్రమం!

భారత్ న్యూస్ విజయవాడ…ఆదాయపు పన్ను చట్టం 2025.. ‘ప్రారంభ్’ పేరుతో కార్యక్రమం!

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ సజావుగా సాగేందుకు సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్ ‘ప్రారంభ్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ చొరవ ద్వారా పన్ను చెల్లింపుదారులకు కొత్త చట్టం పై అవగాహన కల్పించడంతో పాటు, మార్పులను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పన్ను విధానాన్ని మరింత పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు….