భారత్ న్యూస్ శ్రీకాకుళం….అమర జీవి పొట్టి శ్రీరాములుకి నివాళులర్పించిన వైద్యశాఖ
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కోడూరు మండల పరిధిలోని స్వతంత్రపురం ప్రభుత్వ వైద్యశాల వద్ద వైద్యాధికారిని రాణి సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు యొక్క గొప్పతనాన్ని డాక్టర్ రాణి సంయుక్త వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.