బస్ స్టేషన్ తనిఖీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ !

భారత్ న్యూస్ గుంటూరు…బస్ స్టేషన్ తనిఖీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ !

గుంటూరు ఆర్‌టీసీ బస్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐ.ఏ.ఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి కనీస వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు.
మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యత, ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి రోజు పర్యవేక్షణతో ప్రయాణీకులకు శుభ్రమైన, సురక్షిత వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తి పెరగడం లక్ష్యమన్నారు….