భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. …భానుడి సెగలతో శీతల పానీయాలకు రెక్కలు
మండుతున్న ఎండలు అవకాశంగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్న కూల్ డ్రింక్ షాప్ నిర్వాహకులు
ఒక్కొక్క కూల్డ్రింక్ పై ఎమ్మార్పీ ధర కంటే ఐదు నుండి పది రూపాయలు పెచ్చు ధరలకు అమ్మకాలు
పెచ్చు ధరలకు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించే వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇష్టమైతే కొనండి లేదంటే పొండి అంటున్న వ్యాపారస్తులు
నాగాయలంక మండలం పరిధిలో కూల్ డ్రింక్ షాప్ యజమానులు వినియోగదారుల జేబులుకు చిల్లులు పెడుతున్నారు. కంపెనీ వారు నిర్ణయించిన ఎంఆర్పి ధరకి అన్ని పనులతో సహా అమ్మ వలసి ఉండగా! ఒక్కొక్క కూల్డ్రింకుపై ఐదు నుండి పది రూపాయలు పెచ్చు ధరలకు అమ్ముతూ అందిన కాడికి దోచుకుంటున్నారు, చర్యలు తీసుకోవలసిన అధికారులు కళ్ళు మూసుకుంటున్నారని వినియోగదారుల గోడు వినిపించుకునే వారే కరువయ్యారని చర్చించుకుంటున్న పరిస్థితి……
మండలం పరిధిలోని కమ్మనమోలు, నాలీ, సంగమేశ్వరం, భావదేవరపల్లి, మొదలగు గ్రామాల్లోని షాపులలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా వారిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొని వినియోగదారుల భారాన్ని తగ్గించవలసిందిగా కోరుతున్నారు.