భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…గీత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
అమరావతి :
గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికులకు మద్యం దుకాణాలు, బార్ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం తాజాగా ఆదరణ – 3 పథకం ద్వారా ద్విచక్ర వాహనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో ఆదరణ-3 పథకం ప్రారంభించనున్నామని మంత్రి సవిత శనివారం తెలిపారు. తాటి చెట్లు ఎక్కే కార్మికులకు ఆధునిక పరికరాలు, తాటి ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పన కోసం చర్యలు తీసుకుంటామన్నారు
