భారత్ న్యూస్ రాజమండ్రి….ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేసి.. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ ముఠా..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాకినాడలో టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు
గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం
ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి
పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారు
కారులో పోలీస్ యూనిఫారం ఉందని, పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్న అధికారులు

తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు