భారత్ న్యూస్ విశాఖపట్నం..జడ్పీ ఎన్నికలకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక
స్థానిక ఎన్నికల ముందే జిల్లా పరిషత్లు విభజన
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీల పునర్విభజనపై న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవన్నారు. గురువారం శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పల్లెల్లో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటపుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నామని తెలిపారు.
