రాష్ట్ర ప్రజలు, రైతాంగం పక్షాన చేతులు జోడించి వేడుకుంటున్నాం.

భారత్ న్యూస్ గుంటూరు…వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

రాష్ట్ర ప్రజలు, రైతాంగం పక్షాన చేతులు జోడించి వేడుకుంటున్నాం.

పోలవరంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.

ప్రాజెక్టును ఉద్ధరిస్తున్నామని చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు.

జీవనాడి లాంటి పోలవరంలో జీవం తీసి కుట్రపూరితంగా జీరో చేశారు.

ప్రాజెక్ట్ లో నీటి నిల్వ ఎత్తు 45.7 మీటర్ల నుంచి 41.15కు తగ్గించి విధ్వంసం చేశారు.

నీటి నిల్వ సామర్ధ్యం 119.4 TMCలకు కుదించి బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్త బ్యారేజీగా మార్చారు.

R&R ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు పోలవరాన్ని మొత్తంగా చంపేశారు.

కేవలం రూ.22వేల కోట్ల మిగులు కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ ఘోరంగా దెబ్బతీస్తుంది.

గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నారు.

41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే కుడి, ఎడమ కాలువలకు ..

సహజంగా నీరు పారదనే నిపుణుల హెచ్చరికలు బేఖాతర్ చేస్తున్నారు.

ఎత్తు తగ్గింపుతో ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరుగుతుంటే..

కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా మోడీ గారి ప్రయోజనాలే మిన్న.

నీటి నిల్వ ఎత్తు తగ్గింపుపై చంద్రబాబు గారి తీరు చూస్తుంటే “జంకు లేని బొంకు తత్వం” అన్నట్లు ఉంది.

బనకచర్ల మీదున్న ప్రేమ బాబు గారికి పోలవరం మీద లేదు.

అనుసంధానం అనుమతుల మీద పెట్టిన శ్రద్ధ ..

పోలవరానికి పూర్తిస్థాయి నిధుల సాధన మీద పెట్టడం లేదు.

పార్లమెంట్ వేదికగా 41.15 మీటర్ల నీటి నిల్వ ఎత్తు వరకే నిధులు పరిమితం చేస్తామని బీజేపీ చెబుతుంటే ..

నిలదీసే దమ్ము కూటమిలోని టీడీపీ, జనసేన సభ్యులకు లేదు.

పోలవరానికి శుభవార్త చెప్తామంటూ ఈ నెల 28న సమీక్ష చేస్తున్న ప్రధాని మోడీ గారిని …

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.

జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.

ప్రాజెక్ట్ నిర్మాణంలో ఫేజ్ 1, ఫేజ్ 2లు మాకొద్దు.

మొదటి DPR ప్రకారం నీటి నిల్వ సామర్ధ్యం 45.7 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు జరగాల్సిందే.

ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 194.6 టీఎంసీలుగా ఉండాల్సిందే.

పోలవరం ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు, 28.50లక్షల మందికి తాగునీరు ఇవ్వాల్సిందే.

45.7 మీటర్ల ఎత్తు ప్రకారం R&R ప్యాకేజీలో మిగిలిన 94వేల కుటుంబాలకు 100శాతం పరిహారం ఇవ్వాలని,

మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి, పోలవరం ప్రయోజనాలను కాపాడాలని