భారత్ న్యూస్ రాజమండ్రి…ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం కలకలం నకిలీ మద్యం తయారుచేసి బెల్టు షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Ammiraju Udaya Shankar.sharma News Editor.వేగవరం గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారుచేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు..
99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో 30 ఎంఎల్ లిక్కర్ బయటకు తీసి, కల్తీ మద్యాన్ని నింపి వీళ్లు కొనుగోలు చేసిన క్యాప్ లతో మళ్లీ సీల్ చేస్తున్నారు..
కల్తీ మద్యం తయారీదారుల వద్ద నుండి 20వేల మద్యం బాటిళ్లు క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం ఓఏబి బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు..

అలాగే 100కు పైగా నకిలీ మద్యం బాటిళ్లు తయారీదారుల వద్ద నుంచి పోలీసు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు…