భారత్ న్యూస్ మంగళగిరి…తుఫాన్ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం..!
సహకారం అందించిన అధికారులకు కృతజ్ఞతలు..
కోడూరులో ఉపముఖ్యమంత్రి పర్యటించడం సంతోషకరం.
కోడూరు:ముంథా తుపాన్ విపత్తును అధికారులు సహకారంతో ముందస్తు ఆలోచనతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, సహకార అందించిన అధికారులకు కూటమి నాయకులకు కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద స్థానిక పార్టీ నేతలతో కలిపి పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కోడూరు ప్రాంతానికి వచ్చి తుఫాను ప్రభావిత వరి పొలాలను పరిశీలించటం సంతోష కరమన్నారు.
కోడూరు మండల దిగు ప్రాంతంలో ముంపుకు గురవుతున్న పడుతున్న పంట పొలాలను గూర్చి, అవుట్ పాల్స్ నిర్మాణం గూర్చి,విడియో ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అవనిగడ్డ ఎమ్మెల్యే ,మచిలీపట్నం ఎంపీ తీసుకువెళ్లారన్నారు.
నా బోర్డ్ నుంచి నిధులు మంజూరు కాగానే అవుట్ పాల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారు.

పునరావస కేంద్రాలకు విచ్చేసిన తీర ప్రాంత వాసులకు, నిత్యవసర సరుకులు, ఒక్కొక్కరికి 1000 నగదు అందిచడం జరుగుతుందన్న
