భారత్ న్యూస్ కడప .నేడు రాజ్ కసిరెడ్డిని విచారించనున్న ఈడీ
AP: లిక్కర్ స్కామ్లో విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రాజ్ కసిరెడ్డిని ఇవాళ ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. విజయవాడలో సిట్ అధికారులతో చర్చలు జరిపింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ఈ కేసును ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.
