భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ కేంద్రం సేవలు
అమరావతి :
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన డిజిటల్ నెర్వ్ కేంద్రం సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చు. అలాగే వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించవచ్చు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలు పొందవచ్చు.
