భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి

Ammiraju Udaya Shankar.sharma News Editor…జడ్ స్కాలర్ సీఈవో జే చౌదరితో మంత్రి లోకేష్ భేటీ
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జడ్ స్కాలర్ (Zscaler) సీఈవో జే చౌదరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్లయింట్లు వస్తున్నారు. వారంతా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారు. విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యాన ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. జడ్ స్కాలర్ సీఈవో జే చౌదరి మాట్లాడుతూ… మా సంస్థ బెంగుళూరులో మేజర్ ఇంజనీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్, కోర్ ప్లాట్ ఫాం డెవలప్ మెంట్ సెంటర్ నిర్వహిస్తోంది. భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు (GSIలు), టెలికం ప్రొవైడర్లతో కలిసి భాగస్వామ్యాలను విస్తరిస్తున్నాం. సురక్షితమైన డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం అగ్రశ్రేణి భారతీయ బ్యాంకులు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
