భారత్ న్యూస్ రాజమండ్రి…సామర్లకోట లో ఖాళీ ఇంటికి రూ.1.99కోట్ల కరెంట్ బిల్లు….
సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది……
ఆన్లైన్లో వచ్చిన బిల్లు ఏకంగా రూ.1.99కోట్లుగా ఉండటంతో షాక్ అయిన గృహిణి..
ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై దుర్గ కుటుంబం విస్మయం వ్యక్తం చేస్తున్నారు….
దీనీపై స్థానిక విద్యుత్ కార్యాలయం లో ఫిర్యాదు చేసిన బాధితురాలు బంధువులు….
బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొత్త మీటరు మార్చడం వలనే టెక్నీకల్ ప్రాబ్లెమ్ తో కరెంటు బిల్ ఎక్కువగా వచ్చిందని లబ్ధిదారునికి వివరణ…
కరెంటు బిల్ ను సరిచేసిన అనంతరం రూ.147 ల బిల్లును లబ్ధిదారులకు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు….
