తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ..

భారత్ న్యూస్ నెల్లూరు….తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ..

పులిగడ్డలో మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

అవనిగడ్డ:మొంథా తుఫాను కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల వల్ల, అలాగే అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించడం వలన గత ఐదు రోజులుగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు నేడు కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచింది ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గం, పులిగడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారికి 50 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
అంతేకాకుండా,దివి మార్కెట్ యార్డు తరపున వారికి అదనంగా ఉల్లిపాయలు మరియు బంగాళాదుంపలను కూడా పంపిణీ చేశారు. ఈ సహాయం తాత్కాలికంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించిందని నేతలు అన్నారు
ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రభుత్వం తమకు చేసిన ఈ తక్షణ సహాయానికి మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సహాయక పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,ఆర్డీవో స్వాతి, తహసీల్దార్ నాగ మల్లేశ్వరరావు,పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, ఎంపీటీసీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు , స్థానిక పార్టీ నేతలు మండలి రామ్మోహన రావు,గుంటూరు వినయ్ బాబు,మండలి శివ ప్రసాద్,నాగిడి రాంబాబు, చెన్ను బాబురావు తదితరులు పాల్గొన్నారు