ఆధార్‌ అప్‌డేట్‌ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..!

భారత్ న్యూస్ అనంతపురం .. .ఆధార్‌ అప్‌డేట్‌ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..!

ఏళ్ల తరబడి ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోలేదా?. అయితే ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం జూన్ 14 వరకు ఉంది. గత 10 ఏళ్లుగా ఎలాంటి అప్‌డేట్ చేయనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని UIDAI సూచించింది. దీనికి my Aadhaar వెబ్‌సైట్‌ (https://myaadhaar.uidai.gov.in) ద్వారా OTP సాయంతో లాగిన్‌ కావాలి. అడ్రెస్‌, ఐడెంట్‌టిటీ ఆధారిత పత్రాలను అప్‌లోడ్ చేసి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.