భారత్ న్యూస్ గుంటూరు….గోవాకు వెళ్లే ప్రేమ జంటలకు అలర్ట్..
😎వెలుగులోకి బ్లాక్‌మెయిల్ దందా..
తన హోటల్‌లో దిగిన ప్రేమ జంటలపై హోటల్ యజమాని కుట్రలకు తెరతీశాడు. ప్రేమ జంటల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్నా వినకుండా బెదిరింపులకు గురిచేశాడు. ఈ సంఘటనకు సంబంధించి సనత్ నగర్ పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన 35 ఏళ్ల ఓ మహిళ 2023లో తన ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. ఆ ప్రేమ జంట యశ్వంత్ అనే వ్యక్తికి చెందిన హోటల్‌లో దిగింది.

యశ్వంత్ వారు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా వీడియోలు తీశాడు. రెండేళ్లు గడిచిపోయాయి. అనుకోని కారణాల వల్ల ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లయింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ మహిళకు ఫోన్ చేశాడు. పాత వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని ఆమె చెప్పింది. తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకుంది.
యశ్వంత్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. వేధింపులు మరింత పెంచాడు..