గుడివాడలో కదులుతున్న బెట్టింగ్ డొంక!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….గుడివాడలో కదులుతున్న బెట్టింగ్ డొంక!

మరో 20 మంది బుకీల పేర్లు బయటకు..

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మసాల శివ సామ్రాజ్యం

పోలీసుల అదుపులో మరో గుడివాడ బుకీ!

ఆర్థిక లావాదేవీలన్నీ వైసీపీ నాయకుడి కనుసన్నల్లో

క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని కుకటి వేళ్లతో సహా పెకలించాలని జిల్లా ఎస్సీ విద్యాసాగర్ నాయుడు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది.

ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో బుకీ, గుడివాడకు చెందిన నెంబర్ హోటల్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ మాఫియా వృక్షం వేళ్లు తెలుగు రాష్ట్రాలకు పాకడంపై పోలీసులు విస్తుపోతున్నారు.

ఆదివారం రాత్రి గుడివాడ మండలం గుంటాకోడూరు చేపల చెరువుపై స్పెషల్ బ్రాంచ్, గుడివాడ తాలుకా పోలీసుల దాడిలో పట్టుబడిన కలిపిండి శివ ఆలియాస్ మషాలా శివ ఆర్థిక లావాదేవీలన్నీ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు చూస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ తాలుకా ఎంత నగదు ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది, ఎవరి బ్యాంకు ఖాతాల్లో ఎంత ఉంది, ఎవరూ ఎంత బకాయి పడ్డారో సదరు నాయకుడి వద్ద వివరాలున్నట్లు సమాచారం. బెట్టింగ్ నగదు బకాయిల వసూళ్లు వ్యవహారమంతా రామునే చూసుకుంటాడని పట్టణంలో వినికిడి. శివ పట్టుపడటంతో సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

20మంది బుకీల పేర్లు…

మషాలా బండి నుంచి ప్రారంభమైన శివ ప్రస్థానం తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఇతను నడుపుతున్న బెట్టింగ్ సామ్రాజ్యాన్ని చూసి పోలీసులకే కళ్లుతిరిగాయి.

ఏ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడో అంతు చిక్కని పరిస్థితులున్నాయి. పోలీసుల విచారణలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది బుకిల పేర్లను వెల్లడించినట్లు సమాచారం. పేర్లను ప్రధానంగా పామర్రులో ఇద్దరు, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లకు చెందిన వారి పేర్లు బహిర్గతమైనట్లు ప్రాథమికంగా తెలిసింది. గుడివాడ పట్టణంలోని హోటల్ యజమాని, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నట్లు సమాచారం.

ఏ నిమిషాన ఎవరి పేరు బయటకు వస్తుందనే టెన్షన్లో ఉన్నారు. పోలీసుల జోరుతో మాఫియాలో భాగస్వామ్యులైన కొందరు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు బెంబేలెత్తిపోతున్నారు.

జల్లెడ పడుతున్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బెట్టింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పెకలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ
మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రానున్న రెండు, మూడు రోజుల్లో మరికొంత మంది బిగ్ షాట్ల అరెస్టులు ఉంటాయని తెలిసింది. విచారణ పూర్తి స్థాయిలో పూర్తవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.