భారత్ న్యూస్ శ్రీకాకుళం….వేతన సవరణ అమలు కోరుతూ బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో బ్యాంక్ ఉద్యోగులు
మచిలీపట్నం: మార్చ్ 25, లక్ష్యం న్యూస్
మచిలీపట్నంలో బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) ఉద్యోగులు వేతన సవరణ అమలు కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జాయింట్ ఫోరమ్ ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరమణ సమయంలో బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూఉద్యోగులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, వేతన సవరణ అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఏప్రిల్ 8 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 13న విజయవాడలో రాష్ట్రస్థాయి సమ్మె, ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామనితెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు
