తిరువూరులో బ్యాంక్స్ ఉద్యోగులు ఆందోళన

భారత్ న్యూస్ రాజమండ్రి…ఎన్టీఆర్ జిల్లా:

తిరువూరులో బ్యాంక్స్ ఉద్యోగులు ఆందోళన

యునైటెడ్ ఫోరం ఆఫ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్స్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

అన్ని బ్యాంక్స్ ఉద్యోగులు విధులకు స్వస్థి చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరువూరు మెయిన్ బ్రాంచ్ ముందు బైఠాయించి ధర్నా చేశారు.

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంపై ఆలస్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడ నాడాలని నినాదాలు చేశారు.

తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని బ్యాంకుల యూనియన్ల ఐక్య వేదిక కన్వీనర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.