AP Municipal Services ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఒక్క క్లిక్‌తో 25 రకాల సేవలు

భారత్ న్యూస్ విజయవాడ…AP Municipal Services ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఒక్క క్లిక్‌తో 25 రకాల సేవలు

ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయా? అయితే ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవీకరించిన పురపాలక పోర్టల్ ద్వారా ఒక్క క్లిక్‌తో 25 మున్సిపల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. AP Municipal Services Online వ్యవస్థ ద్వారా ఇంటి నుంచే, మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కీలక సేవలు సులువుగా పొందొచ్చు ఇంతకుముందు కొత్త ఇంటికి ఆస్తి పన్ను విధించించాలంటే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సిబ్బంది చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది.