AP Liquor Scam : నిందితుల కస్టడీ పై ఏసీబీ కోర్టు తీర్పును మే 29 కి వాయిదా..

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…AP Liquor Scam : నిందితుల కస్టడీ పై ఏసీబీ కోర్టు తీర్పును మే 29 కి వాయిదా..

మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు.. తన తీర్పును వాయిదా వేసింది. మే 29వ తేదీకి ఈ తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు సోమవారం వెల్లడించింది.

మద్యం కుంభకోణంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో(ACB Court) సోమవారం ఉదయం వాదనలు జరిగాయి.

వాదనలు విన్న కోర్టు… సాయంత్రం తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో తీర్పును రిజర్వు చేసింది. కానీ తీర్పును మే 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఆ తర్వాత ప్రకటించింది.