భారత్ న్యూస్ విశాఖపట్నం..సెప్టెంబర్ 25 నుండి వాయుగుండం హెచ్చరిక:
ఈ సంవత్సరం మొదటి వాయుగుండం ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు వైపు కదులుతోంది. దీని వలన ఉత్తర ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం ప్రాంతం) తో పాటు శ్రీకాకుళం – విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 26వ తేదీ నుండి, వర్షాలు మరింతగా మధ్య ఆంధ్రప్రదేశ్ (గుంటూరు – కృష్ణా – ఉభయ గోదావరి జిల్లాలు) మరియు ఉత్తర రాయలసీమ (కర్నూలు / నంద్యాల) ప్రాంతాలకు విస్తరిస్తాయి. వాయుగుండం ప్రయాణ దిశలో స్వల్ప మార్పుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడతాయి. దయచేసి అప్రమత్తంగా ఉండండి మరియు ఇది అల్పపీడనం లాంటిది కాదు
