భారత్ న్యూస్ విజయవాడAmmiraju Udaya Shankar.sharma News Editor……బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే.. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు హెచ్చరించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో ఈ జంతువుల వధపై నిషేధం ఉందని గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ చట్టాలను గౌరవించి, వీటిని వధించరాదని కోరారు. క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, జంతు వధను నివారించాలని పశుసందర్ధక శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
