అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు.. NPS, ఆధార్, UPIలో మార్పులు

భారత్ న్యూస్ విజయవాడ…అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు.. NPS, ఆధార్, UPIలో మార్పులు

జాతీయ పెన్షన్ పథకం (NPS), ఆధార్ అప్డేట్లు, ఆన్లైన్ గేమింగ్, UPI వంటి అనేక రంగాలలో అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు మారనున్నాయి.

NPSలో పెట్టుబడిదారులు ఒకే పాన్ నంబర్లో బహుళ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

IRCTC టికెట్ బుకింగ్ మొదటి 15 నిమిషాలు ఆధార్-లింక్డ్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

UPI ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ నిలిపివేయబడుతుంది. అలాగే, ఆధార్ సేవలకు రుసుములు పెరగనున్నాయి.

ఆన్లైన్ గేమింగ్ నూ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.