ఈనెల 6 వరకూ ఆధార్ క్యాంపులు

భారత్ న్యూస్ విజయవాడ…ఈనెల 6 వరకూ ఆధార్ క్యాంపులు

గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 6 వరకూ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.