భారత్ న్యూస్ మంగళగిరి…90 సంవత్సరాల వృద్దురాలు రేషన్ షాపు కి రావాలంటు హుకుం
*వేలి ముద్ర వేయించుకోని రేషన్ ఇవ్వని వైనం
*గత మూడు నెలలుగా రేషన్ ఇవ్వని తీరు
*ప్రభుత్వం వృద్దులకు వికలాంగులకు ఇంటివద్దకే రేషన్ ఇవ్వవలసి ఉన్న తిలోదకాలు ఇస్తున్న ఐడి నంబర్ 0684242
*లబ్బీపేటలోని ఫకీరుగుడెం నాగమణి స్టోర్ లో నిర్వాకం
*మాముళ్ళ మత్తులో పౌరసరాఫరా అధికారులు
*చెలరేగుతున్న రేషన్ మాఫీయా
విజయవాడ,లబ్బీపేట ,నవంబర్ 3:పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండ ఉండేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చౌకధరల దుకాణాల వద్దే రేషన్ బియ్యం తీసుకోవాలని భావించి ఆవిధంగా చర్యలు తీసుకున్నారు.కాని వృద్దులకు,వికలాంగులు ఎటువంటి ఇబ్బందులు గురి కాగుడదనే తలంపుతో ఇంటి వద్దనే రేషన్ బియ్యాన్ని అందించాలని ఆదేశించారు.కాని లబ్బీపేట ఫకీరుగుడెంలో ఉన్న నాగమణి అనే డీలర్ 90 సంవత్సరాల వృద్దురాలైన గద్దల నారమ్మను సైతం రేషన్ దుకాణం వద్దకే వచ్చి తీసుకోవాలని హుకుం జారి చేశారు. అమ్మా నేను రాలేను అన్నా కాని వినకుండా వస్తేనే బియ్యం ఇస్తానని అన్నారని తెలిపారు. దాంతో గత మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని వాపోయారు.అంతే కాకుండా గత నెలలో తంబ్ వేయించుకోని బియ్యం,పంచాదార ఇవ్వలేదని తోంభై సంవత్సరాల వృద్దురాలైన గద్దల నారమ్మ ఆవేధన వ్యక్తం చేశారు.వృద్దురాలైన తనకు ఇంటి వద్దకు రేషన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
( రేషన్ మాఫియా పై మరిన్ని కథనాలు)
