భారత్ న్యూస్ విజయవాడ…ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
మహారాష్ట్రలోని పుణేకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆరు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది స్పాట్లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ బృందాలు ఆస్పత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
