భారత్ న్యూస్ విజయవాడ…రైతులకు వెంటనే యూరియా, డిఎపి సరఫరా చేయాలి
లేదంటే రైతు ఉద్యమం తప్పదు
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు డిమాండ్
పురిటిగడ్డ పిఎసిఎస్లో ఎరువుల నిల్వలు పరిశీలించిన సింహాద్రి
చల్లపల్లి:
రైతులకు చాలీచలకుండా అరకొరగా ఎరువులు అందిస్తూ చేతులు దులుపుకుందామనుకునే ధోరణికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలని, రైతులకు పూర్తిస్థాయిలో యూరియా, డిఎపి ఎరువులను తక్షణమే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాధమిక వ్యవసాయ సహకరా పరపతి సంఘం (పిఎసిఎస్)ను శనివారం పరిశీలించారు. యూరియా, డిఎపి నిల్వలు ఎంత ఉన్నాయి…. ఎలా పంఫిణీ చేస్తున్నారని పిఎసిఎస్ సెక్రటరీ నాగేశ్వరరావును అడిగారు. ప్రస్తుతం స్టాకు తక్కువుగా ఉంటం వల్ల ఎకరాకి అరబస్తా చొప్పున యూరియాను రైతులకు ఇస్తున్నామని వివరించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి లోడు వస్తుందని రాగానే అందరికీ ఇస్తామన్నారు. అందరూ ఒకేసారి నాట్లు వేయటం వల్ల కొరత పచ్చినట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఇంతలో రమేష్ బాబు కల్పించుకుని విడతల వారీగా నాట్లు వేయాలని ఏమి రూలు లేదని, అదునును బట్టి రైతాంగం నాట్లు వేసుకుంటారని తెలిపారు. ఇంకా రమేష్ బాబు మాట్లాడుతూ ఎకరానికి బస్తా చొప్పున యూరియా అవసరం కాగా కేవలం అరబస్తా చొప్పన మాత్రమే ఇచ్చి చేతులెత్తేయటం సిగ్గుచేటన్నారు. రైతులకు కొరత లేకుండా పూర్తిస్థాయిలో ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నొక్కిచెప్పారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇదే పరిస్థితని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల అవనిగడ్డ వ్యవసాయాధికారి దగ్గరకు వెళ్ళి అడిగితే అవనిగడ్డ పరిధిలోని నాలుగు మండలాల్లోని అన్ని పిఎసిఎస్లలో యూరియా, డిఎపి నిల్వలు ఉన్నట్లు చెప్పారన్నారు. తీరా అన్ని చోట్లా పరిశీలిస్తే కేవలం ఒక్క నాగాయలంక మండలంలోని గుల్లలమోద, కమ్మవారిపాలెం మొత్తం మీద రెండు పిఎసిఎస్లలో మాత్రమే యూరియా, డిఎపి నిల్వలు ఉన్నాయని ఇది కూటమి ప్రభుత్వం పనితీరుకు, ముందుచూపుకు నిదర్వనమని ఎద్దేవా చేశారు.
గత జగన్మోహనరెడ్డి ప్రభుత్వ హయాంలో మిషన్తో కోసిన బిపిటి దాన్యాన్ని కల్లాల్లోనే రూ.2200ల చొప్పన కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతులు దిక్కులేక కేవలం రూ.1600లు.. రూ.1700లకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా కూటమి ప్రభుత్వ పుణ్యమా అని పంటలు బాగా పండినా సరైన ధర లభించక రైతులు ఎకరాకు రూ.30వేల వరకూ నష్టపోయారని అన్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేయలేకపోకపోవటం వల్ల ఆరంభంలోనే రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది పండించిన పంటమీద నష్టపోతే ఈసారి పంటమీదే నష్టపోయే దుస్థితి దాపురించిందని ఆవేధన వ్యక్తంచేశారు. ఇది ఇలాగే కొనసాగిగే ఖచ్చితంగా రైతు ఉద్యమం అనేది మొదలవుతుందని హెచ్చరించారు. అక్కడ వరకూ తెచ్చుకోకుండా కూటమి ప్రభుత్వ మేలుకుని అని పిఎసిఎస్లలో, అన్ని చోట్లా యూరియా, డిఎపి కొరతేకుండా సరఫరాచేసి రైతులకు అవసరమైన మేరకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అనంతరం రైతులుకు వెంటనే సరిపడా యూరియా, డిఎపి పూర్తిస్థాయిలో సరఫరా చేయలని కోరుతూ పిఎసిఎస్ కార్యదర్శికి రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అవనిగడ్డ జడ్పీటీసి సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, రాష్త్ర ప్రచార కమిటీ విభాగ కార్యదర్శి గాజుల జయగోపాల్, వైసిపి ఘంటసాల మండల కన్వీనర్ వేమూరి వెంకట్రావు, నడకుదురు, పులిగడ్డ సర్పంచులు గొరిపర్తి సురేష్, విజయ్, పార్టీ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, మోపిదేవి ద్వారకానాద్, వెనిగళ్ల తారకజగదీష్, జుజ్జువరపు భాగ్యారావు, గొరిపర్తి రమేష్, రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
