టమాట పంటను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన టిడిపి నేతలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం…టమాట పంటను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన టిడిపి నేతలు

జెడి తో మాట్లాడి టమాట కొనుగోలుకు మార్గం సుగమం చేసిన ఏఎంసీ చైర్మన్

మోపిదేవి

మోపిదేవి మండలంలోని మోపిదేవి లంక నాగాయితిప్ప, కోసూరు వారి పాలెం, పోచిగానిలంక గ్రామాల్లో టిడిపి నేతలు పర్యటించి టమాటా పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి నేతలు టమాట పంటలను పరిశీలించారు. మండలంలో ఎంత విస్తీర్ణంలో టమాటా పంట ఉన్నది ఎంత కాలం వస్తుందని వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టమాట కేజీ రెండు రూపాయల కూడా ధర రావడంలేదని రైతులు వారికి తెలియజేశారు. .

పోచి గాని లంక గ్రామంలో పంట ఆశాజనకంగా ఉండి ధర లభించకపోవడంతో నరికి వేయబడిన తోటను పరిశీలించి రైతు నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధర రాకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఏ ఒక్క రైతు పంటకు గిట్టబాటు ధర లేక నష్టపోకుండా చూడడమే ప్రభుత్వా లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు రైతులకు భరోసా కల్పించారు .

మార్కెటింగ్ శాఖ జెడి తో వెంటనే ఫోన్లో మాట్లాడి మోపిదేవి మండలంలో సాగుచేసిన టమాటా పంటను కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న రైతు బజార్లలో రైతులను నేరుగా అమ్మకాల సాగించేలా ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన జెడి వెంటనే రైతులతో మాట్లాడి టమాటాకు రవాణా ఖర్చులు మార్కెటింగ్ శాఖ భరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు టమాటా సాగు చేస్తున్న రైతులంతా మార్కెటింగ్ శాఖ అధికారులు సూచనల మేరకు ఉత్పత్తులను నేరుగా అమ్మకాల సాగించు కోవాల్సిందిగా తెలిపారు.