.రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

..భారత్ న్యూస్ హైదరాబాద్….రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి గారు రైతునేస్తం కార్యక్రమంను ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి మరో 1034 రైతువేదికల్లో రైతునేస్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. రైతునేస్తం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని, వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభకు వివిధ ప్రాంతాలకు చెందిన 1500మంది రైతులు హాజరయ్యారు..