కృష్ణా జిల్లాలో రైతన్నా మీకోసం ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…రేపు కృష్ణా జిల్లాలో రైతన్నా మీకోసం ప్రారంభం

ఘంటసాల రానున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

(ఘంటసాల):-

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ డా.మనాజిర్ జీలాని సామూన్, కలెక్టర్ డి.కె.బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు

ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, పరుచూరి దుర్గా ప్రసాద్, మేడికొండ విజయ్, పాడిబండ్ల నరేష్ తదితరులు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు, వచ్చే ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ ప్రసాద్, కెవికె శాస్త్రవేత్తలు రేపతి, నవీన్, మంజువాణి, యశ్వంత్ కుమార్, కృష్ణవేణి, వెంకటలక్ష్మీ, ఏడిఏ ఎస్.శ్యామల, ఇంచార్జ్ ఏవో అనూష తదితరులు పాల్గొన్నారు