భారత్ న్యూస్ విజయవాడ…గుడ్ న్యూస్.. భూమి లేని రైతులకు త్వరలోనే భూ పట్టాల పంపిణీ!
గుడ్ న్యూస్.. భూమి లేని రైతులకు త్వరలోనే భూ పట్టాల పంపిణీ!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. భూమి లేని రైతులకు త్వరలోనే భూ పట్టాలను అందించనుంది. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికై.. ప్రభుత్వం జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో అర్హులకు యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అంతే కాకుండా.. ఈ కమిటీలు కొత్త వారికి కూడా భూ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
