ఎప్పుడు భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూ చేస్తావా, రైతుల గురించి రివ్యూలు చేయవా రేవంత్ రెడ్డి?

భారత్ న్యూస్ వరంగల్…..ఎప్పుడు భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూ చేస్తావా, రైతుల గురించి రివ్యూలు చేయవా రేవంత్ రెడ్డి?

పంట కొనుగోళ్లు జరగడంలేదని నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పడంలేదా? చెప్పినా రైతులే కదా అని చిన్న చూపు చూస్తున్నావా?

సాయంత్రం 4 గంటలకు పోయి పొద్దున 8 గంటలకు కరెంట్ వస్తుందని రైతులు చెప్తున్నారు

రైతుబంధు ఇయ్యవు, బోనస్ ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు కనీసం రైతుల పంట మద్దతు ధరకు కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వం నీది – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు