భారత్ న్యూస్ అనంతపురం .. ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది.
ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో సివిల్ కోర్టులకే ఈ అధికారం ఉండేది. అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు భారీగా పెరగడంతో ఈ మార్పులు చేసింది.

ఏపీ యాక్ట్ ఎమెండ్మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతోచట్టం అమల్లోకి వచ్చింది.