యూరియా పరిశ్రమల మీద పడ్డ గ్యాస్ కొరత

భారత్ న్యూస్ రాజమండ్రి…యూరియా పరిశ్రమల మీద పడ్డ గ్యాస్ కొరత

ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో తగ్గిపోయిన యూరియా ఉత్పత్తి

గ్యాస్ లభ్యత తగ్గడం వల్ల కేవలం 60% సామర్థ్యంతో పనిచేస్తున్న యూరియా ప్లాంట్లు

పరిస్థితి ఇలాగే కొనసాగితే, చివరికి దేశంలో యూరియా కొరత వస్తుందని సూచిస్తున్న పరిశ్రమ వర్గాలు

గతంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర టన్నుకు 475 డాలర్లు ఉంటే ఇప్పుడు అదీ 25% కంటే ఎక్కువ పెరిగి టన్నుకు దాదాపు 600 డాలర్లకు చేరుకున్న అంతర్జాతీయ యూరియా ధరలు

గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం మూసివేయబడిన గ్యాస్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించిన తర్వాతే ఈ పరిస్థితి చక్కబడుతుందని చెబుతున్న నిపుణులు