భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….భూభారతి అమలు.. రైతులకు తీరని భూసమస్యలు!
మంచిర్యాల జిల్లాలో భూభారతి అమలులోకి వచ్చినప్పటికీ, తమ భూసమస్యలు మాత్రం తీరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూసమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించి, నోటీసులు పంపినప్పటికీ, ఆగస్టు 15తో గడువు ముగిసినా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని పలువురు రైతులు వాపోతున్నారు.

పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు.