భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ఎరువులు, యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.93లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 1156 వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్తు అందించాలన్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చాలని డిస్కమ్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నప్పటికీ దివ్యాంగుల పెన్షన్ అనర్హతపై నోటీసు అందుకున్న వారికి ప్రభుత్వం రీ అసెస్మెంట్ ఆప్షన్ కల్పించింది. తద్వారా మరలా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన.

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కౌశలం సర్వే.. యువతకు ఇంటి నుంచి పని కల్పించే ఆలోచనతో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తుంది.