మొంథా తుఫాను వలన 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్న అధికారులు.

భారత్ న్యూస్ మంగళగిరి…మొంథా తుఫాను వలన 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్న అధికారులు.తుపాను వల్ల 90 వేల ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం. తుపాను వల్ల 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం.

సుమారు 75 వేల మంది రైతులకు నష్టం వాటిల్లిందని సమాచారం.

95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలకు నష్టం.

చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు ధ్వంసం. తుపాను వల్ల సుమారు 1800 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసం.

ఆర్ అండ్ బీకి రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం జరిగిందని అంచనా.

విద్యుత్, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు తీవ్ర నష్టం జరిగిందన్న అధికారులు.