మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి

భారత్ న్యూస్ విజయవాడ…తాడేపల్లి

Ammiraju Udaya Shankar.sharma News Editor…మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి

మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీ నవంబర్‌ 4 వ తేదీకి వాయిదా

మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ నేపధ్యంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీలను మొంథా తుపాను కారణంగా నవంబర్‌ 4 వ తేదీకి వాయిదా వేయడమైనది.

పార్టీ కేంద్ర కార్యాలయం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి