ఖాతాల్లోకి రూ.2000.. వీరికి మాత్రం డబ్బులు జమ కావు!

భారత్ న్యూస్ అనంతపురం…ఖాతాల్లోకి రూ.2000.. వీరికి మాత్రం డబ్బులు జమ కావు!
పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు అక్టోబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ విడతలో కొంతమంది రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి, లేదంటే వారి ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే రూ.2000 అందకపోవచ్చు.

అంతేకాకుండా, తప్పు IFSC కోడ్‌లు, బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా రిజిస్ట్రేషన్‌లో వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదు చేయడం వంటి సమస్యలు ఉన్నా డబ్బు జమ కాదు.