భారత్ న్యూస్ విజయవాడ…తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది….
